నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

Sep 5 2025 5:48 AM | Updated on Sep 5 2025 5:48 AM

నేడు

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

తిరుపతి సిటీ: తిరుపతి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పాటు కలెక్టర్‌, ఉన్నతాధికారులు పాల్గొని జిల్లా నుంచి ఎంపికై న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయనున్నట్లు తెలియజేశారు.

ఎస్వీయూలో ఆరుగురుకి

రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు

ఎస్వీయూలో పనిచేస్తున్న ఆరుగురు అధ్యాపకులకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వరించాయి. ఇందులో పాపులేషన్‌ స్టడీస్‌ అండ్‌ సోషల్‌ వర్క్‌ విభాగం అధ్యాపకుడు టి.చంద్రశేఖరయ్య, బయో కెమిస్ట్రీ విభాగం అధ్యాపకుడు ఎం.బాలాజీ, వృక్షశాస్త్ర విభాగం అధ్యాపకుడు టి.విజయ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకుడు వీ.సుబ్బారావు, ఈసీఈ విభాగం అధ్యాపకురాలు టి.రమశ్రీ, కెమికల్‌ ఇంజిగ్‌ విభాగం ప్రొఫెసర్‌ పి.అఖిల స్వతంత్ర ఉన్నారు. అలాగే ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల జువాలజీ అధ్యాపకులు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.భువనేశ్వరి దేవి ఉన్నారు. వీరు విజయవాడ వేదికగా శుక్రవారం జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో విద్యాశాఖ మంత్రి,అధికారుల చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు స్వీకరించనున్నారు

ప్రతి శుక్రవారం ‘మనమిత్ర’ ప్రచారం

తిరుపతి అర్బన్‌ : డిజిటల్‌ గవర్నెన్స్‌ పేరుతో ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 95523 00009 ద్వారా సేవల వినియోగంపై ప్రతి శుక్రవారం సచివాలయ ఉద్యోగులు ఇంటింటా ప్రచారం చేయాల్సి ఉంది. ఒకవేళ శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం వస్తే మరుసటి రోజు సచివాలయ ఉద్యోగులు ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు గురువారం సచివాలయాల జిల్లా అధికారి నారాయణరెడ్డి వెల్లడించారు. మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ ద్వారానే 709 సేవలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నంబర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలని అనే అంశంపై ఉద్యోగులు అవగాహన కల్పిస్తారని చెప్పారు. సచివాలయ ప్రచార బాధ్యతలపై రూరల్‌ ప్రాంతాల్లో ఎంపీడీఓ, అర్బన్‌ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వివిధ రకాల పనుల కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ ద్వారా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు.

తుడా ప్లాట్ల వేలం ప్రారంభం

తిరుపతి తుడా : తుడా ఆధ్వర్యంలో స్థానిక సూరప్పకశం వద్ద సుమారు 145 ఎకరాల్లో వేసిన పద్మావతి నగర్‌లోని 277 ప్లాట్లకు సంబంధించి వేలం ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. 13వ విడత వేలంలో భాగంగా ఒక చదరపు అడుగునకు రూ.14 వేలు నిర్ణయించారు. తొలిరోజు ఎల్‌ఐజీ 9 ప్లాట్లు, హెచ్‌ఐజీ 3 ప్లాట్లు వేలంలో విక్రయించారు. ఈ వేలం ప్రక్రియ సెప్టెంబర్‌ 17 వరకు నిర్వహిస్తామని తుడా కార్యదర్శి డాక్టర్‌ శ్రీకాంత్‌ బాబు తెలిపారు. ఈ–వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1000 రుసుం చెల్లించి ఈనెల 16లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

నేడు తిరుపతిలో  ఉపాధ్యాయ దినోత్సవం 
1
1/7

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

నేడు తిరుపతిలో  ఉపాధ్యాయ దినోత్సవం 
2
2/7

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

నేడు తిరుపతిలో  ఉపాధ్యాయ దినోత్సవం 
3
3/7

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

నేడు తిరుపతిలో  ఉపాధ్యాయ దినోత్సవం 
4
4/7

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

నేడు తిరుపతిలో  ఉపాధ్యాయ దినోత్సవం 
5
5/7

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

నేడు తిరుపతిలో  ఉపాధ్యాయ దినోత్సవం 
6
6/7

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

నేడు తిరుపతిలో  ఉపాధ్యాయ దినోత్సవం 
7
7/7

నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement