
మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
నాగలాపురం : రాజకీయ కుట్రతో లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడం అక్రమమని సత్యవేడు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పేర్కొన్నారు. గురువారం పిచ్చాటూరు బైపాస్ రోడ్డులో నిరసన తెలిపారు. అనంతరం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నూకతోటి రాజేష్ మండల నేతలతో కలిసి మిథున్ రెడ్డి త్వరగా జైలు నుంచి విడుదల కావాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో అరెస్టు చేస్తే పార్టీ శ్రేణులు భయపడే కాలం చెల్లిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం దాటినా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జగనన్న ప్రారంభించి, పూర్తి చేసిన పనులు తామే చేసినట్లు కాలం వెలిబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చలపతిరాజు, సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మోహన్, రమేష్ రాజు, మండల ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, సూరి బాబు రెడ్డి, నాయకులు త్యాగరాజన్, మోహన్ రెడ్డి, ఏసు దాసు, ఆరుముగం రెడ్డి, విశ్వనాథం, వాసు , చెంచు బాబు, శేఖర్, గోవింద్, చంద్ర, సుబ్బరాజు పాల్గొన్నారు.