
ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,82,17,085 వచ్చింది. ఆలయ ఆవరణలోని కొట్టు మండపంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. ప్రధాన హుండీతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా బంగారం 58 గ్రాములు, వెండి 510.600 కిలోలు, విదేశీ కరెన్సీ 265 వచ్చాయి. గత నెల 30వ తేదీ నుంచి ఈ హుండీ ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి, డిప్యూటీ ఈఓ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, హేమమాలిని, పర్యవేక్షకులు రవి, శ్రీహరి, నాగభూషణం, విజయసారథి, లావణ్య పాల్గొన్నారు
రాష్ట్రస్థాయి పోటీలకు నెల్లటూరు విద్యార్థి
గూడూరు రూరల్ : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు నెల్లటూరు జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎం.వెంకట కార్తీక్ ఎంపికయ్యాడు. నేటి నుంచి ప్రకాశం జిల్లా చేవూరు గ్రామంలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ మేరకు పాఠశాల హెచ్‌ఎం పార్వతమ్మ వెంకట కార్తీక్‌ను అభినందించారు.
పంచాయతీరాజ్ జిల్లా అధికారి బదిలీ
తిరుపతి అర్బన్ : పంచాయతీ రాజ్ జిల్లా అధికారి (ఇంజినీర్)రామ్మోహన్ విజయవాడ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం బదిలీ అయ్యారు. ఆయన ఏడాది కిందట కడప జిల్లా నుంచి తిరుపతికి విచ్చేశారు. అయితే పదోన్నతిలో భాగంగా విజయవాడకు బదిలీ అయ్యారు. అలాగే పీలేరులో పనిచేస్తున్న మధుసూదన్ తిరుపతి జిల్లా పంచాయతీ రాజ్ అధికారిగా నియమించారు. ఆ మేరకు ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు