కూలీలుగా వెళ్లాల్సివస్తోంది
గత ఎనిమిది నెలుగా వేట లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్సి ఆదుకోవడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది. వేట విరామ సాయాన్ని రెట్టింపుగా అందిస్తామని నమ్మబలికి ఇంత వరకు పైసా కూడా ఇవ్వలేదు. దీంతో తమ బతుకులు భారంగా మారిపోయాయి. వృత్తిని వదిలిపెట్టి సమీప కంపెనీల్లో కూలీలుగా వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం పరిహారం అందించాలి. – సోమయ్య మత్స్యకారుడు, తూపిలిపాళెం
ఎలాంటి ఆదేశాలు రాలేదు
మత్స్యకారులకు చెల్లించాల్సిన వేట విరామం నగదు విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే మత్స్యకారుల వేట విరామం సాయంపై వివరాలు అందిస్తాం. అయితే చేపల వేటపై నిషేధం అమలవుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకూడదు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.
– రాజేష్, ఏడీ, మత్స్యశాఖ
●
కూలీలుగా వెళ్లాల్సివస్తోంది


