తమిళనాడు పెట్రోలే వినియోగిస్తాం
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన సత్యవేడులో ఉన్న మాకు కూతవేటు దూరంలో తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ఉంది. సమీపంలోని మాదరపాకం వద్ద ఓ ప్రైవేటు పరిశ్రమలో నేను ఉద్యోగం చేస్తాను. రోజూ ఉద్యోగ రీత్యా తమిళనాడుకు వెళ్లాలి. అక్కడ లీటరు పెట్రోలు రూ.101.12 రేటు ఉంది. ఆంధ్రలో రూ.112కు విక్రయిస్తున్నారు. దీంతో లీటరుకు రూ.10 వరకు ఆంధ్రలో అదనం. దీని కారణంగా తమిళనాడు పెట్రోల్‌నే వినియోగిస్తాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ ఆంధ్రలో సైతం పెట్రోలు ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. – మారెయ్య, ప్రైవేటు ఉద్యోగి, సత్యవేడు


