తిరుపతి క్రైమ్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్పెషల్ పార్టీ పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలన్నారు. శాంతిభద్రతల సమస్య వచ్చినప్పుడు స్పెషల్ పార్టీ పోలీసులదే కీలక పాత్రని వెల్లడించారు. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.