భూతవైద్యుడి చికిత్స.. యువతి మృతి | Young Woman Died While Taking Treatment From An Exorcist | Sakshi
Sakshi News home page

భూతవైద్యుడి చికిత్స.. యువతి మృతి

Apr 1 2021 10:55 AM | Updated on Apr 1 2021 2:09 PM

Young Woman Died While Taking Treatment From An Exorcist - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దేవరకొండ : అనారోగ్యానికి గురైన యువతి కొండమల్లేపల్లిలోని ఓ భూత వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ బుధవారం హఠాన్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పిట్టల నరసింహకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె హిమవర్షిణి అనారోగ్యానికి గురికావడంతో గతకొన్ని రోజులుగా మండల పరిధిలోని కొల్‌ముంతలపహాడ్‌ స్టేజీ సమీపంలోని భూతవైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది. ఈక్రమంలో బుధవారం హిమవర్షిణి అకస్మాత్తుగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండమల్లేపల్లి ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement