శ్రీనగర్‌కాలనీ: యువతితో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలతో మాజీ ప్రియుడు బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడ కృష్ణలంకకు చెందిన యువతి టెలీకాలర్‌గా పనిచేస్తూ రహమత్‌నగర్‌లో నివాసముంటోంది.
ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని జహీర్ అబ్బాస్ అనే యువకుడు నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్ళికి యువతి కుంటుంబీకులు అంగీకరించారు. మరో యువతితో నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యువతి జహీర్‌ను దూరం పెట్టింది.
అయితే జహీర్ యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ గతంలో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆమెకు తెలిసిన వారికి ఫొన్ చేసి, మెసేజులు పంపి దుష్ప్రచారం చేశాడు. దీంతో యువతి తనకు ప్రాణహాని ఉందని మదురానగర్ పోలీసులకు పిర్యాదుచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


