
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోరేటి వెంకన్న, సారయ్యా, దయానందల నియామకాలను చాలెంజ్ చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకం చేపట్టారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం ఎమ్మెల్సీ సిఫార్సులను ఆమోదించడంపై ఆయన హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరును రెండుసార్లు గవర్నర్‌కు ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రానున్న నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.