బీపీ ఉందా.. ఈ జాగ్రత్తలు పాటించండి

World Hypertension Day 2021: Tips to Ensure Accurate Blood Pressure Measurement - Sakshi

బీపీని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి

లేదంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పవు

నిరోధక శక్తి తగ్గి సులువుగా కరోనా సోకే అవకాశం

ఆందోళన చెందితే గుండె పోటు వచ్చే ప్రమాదం

‘సాక్షి’తో కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ డా.ప్రభుకుమార్‌ చల్లగాలి

నేడు (మే 17) వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే 

సాక్షి, హైదరాబాద్‌: రక్తపోటును (బీపీ) ‘సైలెంట్‌ కిల్లర్‌’గా వైద్యులు అభివర్ణిస్తుంటారు. బీపీ నియంత్రణలో లేకపోతే గుండెపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, కంటిచూపు కోల్పోవడం, డిమెన్షియా వంటివి సంభవిస్తాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బీపీ, షుగర్‌ వంటివి నియంత్రణలో లేక రోగ నిరోధకశక్తి తగ్గి సులభంగా కరోనా బారిన పడే ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగినట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేప థ్యంలో ‘మీ రక్తపోటు ఎంతుందో కచ్చితంగా తెలుసుకోండి. దాన్ని నియంత్రణలో ఉంచండి. దీర్ఘ కాలం జీవించండి’ అనే నినాదంతో ‘వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ లీగ్‌’ముందుకు సాగుతోంది. నేడు వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ డే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రక్తపోటుతో ముడిపడిన అంశాలు, సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ డా.ప్రభుకుమార్‌ చల్లగాలి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

సమస్య గుర్తించగానే చికిత్స చేయాలి.. 
రక్తపోటులో వస్తున్న మార్పులను గుర్తిస్తే.. వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. దాదాపు 50 శాతం మందికి వారిలో బీపీ సమస్య ఉన్నట్లు అవగాహన కూడా ఉండట్లేదు. బీపీ పెరగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొవ్వులు చేరడంతో లోపలి పొర చిట్లిపోయే ప్రమాదం ఉంది. వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ లీగ్‌ (డబ్ల్యూహెచ్‌ఎల్‌) సూచనల ప్రకారం బీపీ ఉందో లేదో తెలుసుకునేందుకు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం డాక్టర్ల వద్ద ఉండే స్ఫిగ్మో మానోమీటర్లు అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన బీపీ డిజిటల్‌ మీటర్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

ఎల్లప్పుడూ 140 నుంచి 80 లోపు రక్తపోటు ఉండేలా చూసుకోవాలి. ముందుగా దీన్ని గుర్తించి మందులు వాడితే ఎక్కువ కాలం జీవించి ఉండేందుకు అవకాశం ఉంటుంది. వారం నుంచి 10 రోజుల పాటు బీపీ చెక్‌ చేసి, సరాసరి పాయింట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీపీ ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. 140 నుంచి 90 లోపు బీపీ లేకపోతే వెంటనే మందులు వాడాలి. అనియంత్రిత రక్తపోటు ఎక్కువ కాలం ఉంటే కిడ్నీలు పాడవుతాయి. కంటి వెనుక భాగంలో రక్తనాళాలు చిట్లి బ్లడ్‌ స్పాట్స్‌ కనిపించడంతో పాటు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. గుండెలో, మెదడులో రక్తనాళాలు చిట్లే అవకాశాలుంటాయి. మెదడులో రక్తం గడ్డ కట్టే ప్రమాదమూ లేకపోలేదు. 

బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
► బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. 
► క్రమంతప్పకుండా బీపీ మందులు వాడాలి. 
► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెల్లగా ఎక్సర్‌సైజులు పెంచాలి. 
► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. 
► కిడ్నీ సమస్యలున్న వారు, రక్తంలో సమస్యలున్న వారికి ప్రోటీన్‌ ఫుడ్‌తో సమస్యలు వస్తాయి. చేపలు, కోడిగుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. 
► కోవిడ్‌ బాధితులు ఆందోళనతో బీపీ పెంచుకుంటున్నారు. అలా ఆందోళన చెందొద్దు. 
► కరోనా బాధితుల్లో బీపీ, షుగర్‌ స్థాయిలు కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి. అందుకు తగిన మందులు వాడాలి. 
► బీపీ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 7 రెట్లు పెరుగుతాయి. బీపీతో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల సులభంగా కోవిడ్‌ బారిన పడే అవకాశాలుంటాయి.  

ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.. 
కోవిడ్‌ రాక ముందే జాగ్రత్త చర్యల్లో భాగంగా రక్తపోటు నియంత్రణలో ఉండాలి. బీపీ కంట్రోల్‌లో లేకపోతే రక్త ప్రసరణ బాగా పెరిగి గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు దారితీస్తాయి. అందువల్ల ముందుగానే మందులు వాడి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. అందువల్లే కరోనా చికిత్స సమయంలో రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతారు. లో డెన్సిటీ లిపో ప్రోటీన్లు రక్తంలో, రక్తనాళాల్లో పెరిగితే గుండెపోటు వస్తుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-05-2021
May 17, 2021, 18:21 IST
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ దర్శకుడు సుబ్బు ఇంట విషాదం నెలకొంది....
17-05-2021
May 17, 2021, 16:50 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18,561 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,54,052...
17-05-2021
May 17, 2021, 16:20 IST
చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గొప్ప మనసు చాటుకున్నారు. కోవిడ్‌-19పై పోరులో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. ఈ మేరకు...
17-05-2021
May 17, 2021, 16:06 IST
సాక్షి, విజయవాడ: కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా...
17-05-2021
May 17, 2021, 15:57 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఎందుకు నిర్వహించడంలేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం...
17-05-2021
May 17, 2021, 15:49 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్‌...
17-05-2021
May 17, 2021, 15:25 IST
న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నాయి....
17-05-2021
May 17, 2021, 14:28 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం డీఆర్‌డీఓ, డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్తంగా 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్‌ (2–డీజీ) అనే ఔషధాన్ని అభివృద్ది...
17-05-2021
May 17, 2021, 12:59 IST
నటుడు శివకార్తికేయన్‌ రూ.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. ఎడిటర్‌ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం...
17-05-2021
May 17, 2021, 12:26 IST
కోవిడ్‌ ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. సినీ రంగానికి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడి కన్నుమూశారు. మరికొందరు...
17-05-2021
May 17, 2021, 11:33 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా బృందం నుంచి సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్‌ తప్పుకున్నారు. కోవిడ్ రెండో...
17-05-2021
May 17, 2021, 11:04 IST
సాక్షి, హైదరాబాద్‌: అసలే ఎండాకాలం.. పైగా అది అడవి.. దాహార్తి తీర్చుకోవడమే గగనం.. మరోవైపు బీపీ, షుగర్, ఆస్తమా.. వీటికితోడు...
17-05-2021
May 17, 2021, 10:38 IST
సాక్షి, ఖమ్మం: కరోనా సోకిన వారు అనవసర ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడడం ద్వారా...
17-05-2021
May 17, 2021, 09:27 IST
హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా...
17-05-2021
May 17, 2021, 09:13 IST
నల్లగొండటౌన్‌ : కరోనా వైరస్‌ మరింత శక్తివంతంగా మారుతోంది. మొదటి దశలో కంటే రెండో దశలో కేసులతో పాటు మరణాల...
17-05-2021
May 17, 2021, 08:43 IST
గీసుకొండ : గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారానికి చెందిన హమాలీ కార్మికుడు దొండ అనిల్‌యాదవ్‌కు వారం రోజుల క్రితం...
17-05-2021
May 17, 2021, 08:00 IST
ఆ సంఖ్య మారలేదు. అలాగే ఉంది. దాంట్లో ఎలాంటి మార్పుచేర్పుల్లేవు. ఏదో ఒక్కరోజు మాత్రమే  తెలపాలనుకున్నప్పుడు  వెబ్‌సైట్‌లో ఎందుకు ..?...
17-05-2021
May 17, 2021, 06:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. ఇంకా రోజుకు మూడు లక్షలకు పైనే కేసులు వస్తున్నప్పటికీ... మొత్తం మీద చూస్తే...
17-05-2021
May 17, 2021, 06:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం...
17-05-2021
May 17, 2021, 05:37 IST
అమలాపురం టౌన్‌: వారిద్దరూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కుర్రాళ్లు. కష్టపడి ఉన్నత శిఖరాలను ఆధిరోహించిన యువ కిశోరాలు. ఒకరు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top