ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన | Woman Protest In Front Of Boyfriend House In Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన

Jan 20 2021 9:16 AM | Updated on Jan 20 2021 9:18 AM

Woman Protest In Front Of Boyfriend House In Karimnagar - Sakshi

కుమారుడితో కలిసి నిరసన తెలుపుతున్న స్వప్న

సాక్షి, జగిత్యాల: ప్రేమ పేరుతో రహస్యంగా వివాహం చేసుకొని, కుమారుడు పుట్టిన తర్వాత తనకేమీ తెలియదంటూ మోసం చేశాడని ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాల్లోకి వెళ్లే.. జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన గుజ్జుల స్వప్న, అదే గ్రామానికి చెందిన కట్కూరి వెంకటేశ్‌ ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల కిందట రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్‌ పలుమార్లు విదేశాలకు వెళ్లివచ్చాడు. వీరికి మూడేళ్ల కిందట బాబు జన్మించాడు.

గల్ఫ్‌ నుంచి రెండు నెలల కిందట స్వగ్రామం వచ్చిన వెంకటేశ్‌ స్వప్నను నువ్వు ఎవరో నాకు తెలియదన్నాడు. కుమారుడు కూడా నాకు పుట్టలేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో స్వప్న మంగళవారం అతని ఇంటి ఎదుట కుమారుడితో కలిసి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్‌ ఎస్సై చిరంజీవి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. 

Advertisement
 
Advertisement
Advertisement