Telangana: Heavy Rains Lash Parts of Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad Rains: హైదరాబాద్‌లో మరోసారి దంచికొట్టిన వర్షం

Jul 31 2022 8:13 PM | Updated on Jul 31 2022 9:25 PM

Viral: Heavy Rains Lash Parts of Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండలోనూ వాన కుమ్మేస్తోంది.

వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా గతకొన్నిరోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నేడు మరోసారి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Heavy rain at Punjagutta.@HiHyderabad @swachhhyd @balaji25_t @Rajani_Weather @RajenderPHP @PANDARAJATH @sai_koushika @aSouthIndian @puducherri @NallulaHere @GHMCOnline #HyderabadRains pic.twitter.com/ZyPjeWwWZF

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement