విసుగెత్తిస్తున్న వీఐపీలు | VIP culture not reducing in India | Sakshi
Sakshi News home page

విసుగెత్తిస్తున్న వీఐపీలు

Dec 28 2024 11:48 AM | Updated on Dec 28 2024 11:48 AM

VIP culture not reducing in India

దేశంలో తగ్గని వీఐపీ సంస్కృతి 

లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో ప్రతి ముగ్గురిలో ఇద్దరి అభిప్రాయం ఇదే.. 

ఆసుపత్రులు, రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రార్థన స్థలాల్లో వీఐపీ సంస్కృతి ఎక్కువని వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో వివిధ పదవుల్లో ఉండే నాయకులు, అధికారంలో లేకపోయినా ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా, వ్యాపారం సహా పలు రంగాల్లో అత్యంత ప్రముఖులు.. ఇలా మన దేశంలో వీఐపీ (వెరీ ఇంపార్టెంట్‌ పర్సన్‌)లకు కొదవ లేదు. వీళ్లు కాలు తీసి కాలు పెట్టినా.. అత్యంత ప్రాధాన్యం కోరుకుంటారు. ఇది కొన్ని సందర్బాల్లో శ్రుతి మించుతోంది కూడా. ఇటీవల ఝాన్సీ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు చనిపోవడం తెలిసిందే. 

ఆ చిన్నారుల తల్లిదండ్రులు మృతదేహాల కోసం ఎదురు చూస్తుండగా.. ఓ మంత్రి పరామర్శకు ఆసుపత్రికి వస్తున్నారని సిబ్బంది రోడ్ల వెంట సున్నంతో లైన్లు కొట్టి ఏర్పాటు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దేశంలో ఈ వీఐపీ సంస్కృతిపై విమర్శలు మొదలయ్యాయి. దేశంలో వీఐపీ సంస్కృతిపై లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ దేశవ్యాప్తంగా 362 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 45 వేల మంది అభిప్రాయాలు సేకరించింది. ఆ సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు.. వీఐపీ సంస్కృతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 64 శాతం మంది దేశంలో వీఐపీ సంస్కృతి తగ్గడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ప్రధానంగా రోడ్లపై వెళ్తున్నప్పుడు, టోల్‌ ప్లాజాల వద్ద నిరీక్షణ, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మితిమీరిన జోక్యం వంటి అంశాలను వారు ఉదహరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం, బెదిరింపులకు పాల్పడడం, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం డబ్బు వసూలు.. ఇలా ఎన్నో విషయాల్లో వీఐపీల ధోరణిని వారు సర్వేలో లేవనెత్తారు. సర్వేలో పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు వచి్చన సమాధానాలివి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement