భూమికగా ఎలా మారిందంటే..? | Vijayalakshmi alias Bhumika in Chhattisgarh | Sakshi
Sakshi News home page

భూమికగా ఎలా మారిందంటే..?

May 26 2025 7:37 AM | Updated on May 26 2025 7:37 AM

Vijayalakshmi alias Bhumika in Chhattisgarh

ఇప్పటికీ ఛత్తీస్‌గఢ్‌ ఆస్పత్రిలోనే విజయలక్ష్మి మృతదేహం  

అక్కడికి చేరుకుని పడిగాపులు కాస్తున్న కుటుంబీకులు 

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు విజయలక్ష్మి (36) అలియాస్‌ భూమిక మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావుతో పాటు కేశంపేట మండలం వేములనర్వకు చెందిన విజయలక్ష్మి కూడా చనిపోయింది. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం రాత్రి షాద్‌నగర్‌ నుంచి బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. 

పోస్టుమార్టం తర్వాత పలువురి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. విజయలక్ష్మి మృతదేహాన్ని మాత్రం ఇప్పటికీ అప్పగించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భూమిక 12 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లింది. 

ఓయూ నుంచి అబుజ్‌మడ్‌ వరకు 
వేములనర్వ గ్రామానికి చెందిన వన్నాడ సాయిలు, రాధమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురూ ఆడపిల్లలే. మూడో సంతానమైన విజయలక్ష్మి పుట్టిన ఏడాదికే తల్లి పాముకాటుతో చనిపోయింది. ఇంటరీ్మడియెట్‌ వరకు కేశంపేటలోనే చదువుకుంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. మహబూబ్‌నగర్‌ ఎన్టీఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత 2009–10లో ఓయూ పీజీ కాలేజీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌లో చేరింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. 

పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇదే సమయంలో పోలవరం ముంపు గ్రామాలను సందర్శించి, ఆదివాసీల కష్టాలను చూసి చలించిపోయింది. ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. 2013–14 మధ్య కాలంలో విజయలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. మావోయిస్టు పారీ్టలో చేరిన మొదటి రోజు విషయాలను ‘వసంత మేఘం’ అనే వెబ్‌సైట్‌లో ‘కొత్త బంగారులోకం’ అనే శీర్షికతో ఓ కథను కూడా రాసింది. తానెందుకు గెరిల్లాగా మారాననే అంశాలతో పాటు ఓయూ కేంద్రంగా కొనసాగిన తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసి, చివరికి ప్రధాన కార్యదర్శి నంబాల రక్షణ బృందంలో పని చేస్తూ మరణించింది.  

భూమికగా ఎలా మారిందంటే..? 
విజయలక్ష్మి కేశంపేటలో ఇంటరీ్మడియెట్‌ (2001–2003) పూర్తి చేసింది. అదే సమయంలో ‘ఒక్కడు’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలోని హీరోయిన్‌ భూమిక పోలికలు కలిగి ఉండటంతో స్నేహితులంతా ఆమెను భూమికతో పోల్చుతూ అదే పేరుతో పిలిచేవారు. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత కూడా అదే పేరుతో కొనసాగినట్లు సమాచారం. చిన్నప్పటి నుంచి ఆమెకు సంగీతం, వ్యాసరచన అంటే ఇష్టం. ఇతరులకు సాయపడాలనే తపన బలంగా ఉండేది. ఇదే భావన మావోయిస్టు పార్టీ వైపు మళ్లించింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఆమె ఎప్పడూ ఇంటి ముఖం చూడలేదు.

    ఇప్పటికీ ఛత్తీస్‌గÉŠ  ఆస్పత్రిలోనే 
విజయలక్ష్మి మృతదేహం  
    అక్కడికి చేరుకుని పడిగాపులు కాస్తున్న కుటుంబీకులు 

Advertisement
 
Advertisement
Advertisement