Venkaiah Naidu: రోశయ్యకు అభిమానిని  | Vice President Venkaiah Naidu Consoles Family Members Of Rosaiah | Sakshi
Sakshi News home page

Venkaiah Naidu: రోశయ్యకు అభిమానిని 

Dec 9 2021 4:33 AM | Updated on Dec 9 2021 9:33 AM

Vice President Venkaiah Naidu Consoles Family Members Of Rosaiah - Sakshi

కుటుంబ సభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు

చిన్నతనం నుంచి కొణిజేటి రోశయ్యను బాగా అభిమానించేవాడినని, ఆయన కూడా తనను అభిమానంతో ఆప్యాయంగా పలకరించేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

అమీర్‌పేట: చిన్నతనం నుంచి కొణిజేటి రోశయ్యను బాగా అభిమానించేవాడినని, ఆయన కూడా తనను అభిమానంతో ఆప్యాయంగా పలకరించేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ రోజుల్లో రాజకీయ విభేదాలున్నప్పటికీ అనేక విషయాలపై తాము తరచూ మాట్లాడుకునేవారమని గుర్తు చేసుకున్నారు. బుధవారం అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన ఉపరాష్ట్రపతి.. ముందుగా రోశయ్య చిత్ర పట్టం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఆ రోజు తాను ఇక్కడ లేనని, వారి కుటుంబీకులను కలిసి సంతాపాన్ని తెలియజేయాలని వచ్చానని చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంట రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, మాజీ ఎంపీ కేవీపీ రాంచంద్రారావు, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్‌ గుప్త తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement