జ్ఞానం, నైపుణ్యం, నాయకత్వం

US Student Speaks About Exchange Program - Sakshi

యూఎస్‌ స్టూడెంట్స్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌పై విద్యార్థుల మనోగతం

అమెరికాలో విద్యను అభ్యసించడం గొప్ప అనుభూతి అని స్టూడెంట్స్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికాలో చదివిన పలువురు విద్యార్థులు అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని గురువారం సాయంత్రం యూఎస్‌ కాన్సులేట్‌ ఏర్పాటు చేసిన వెబినార్‌లో విద్యార్థులు మలావత్‌ పూర్ణ, సంజుక్తసింగ్, ప్రియాంక గడారి, నెమలి సిద్ధార్థ్‌ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా అమెరికాలోని వివిధ నగరాల్లో వారు విద్యన భ్యసించిన తీరు, సంస్కృతి, సంప్రదాయాలు, విద్యా విధానం, తెలుసుకున్న విషయాలు తదితర వాటిపై వారు తమ అనుభవాలు పంచుకున్నారు. ఏటా స్టూడెంట్స్‌ ఎక్సే ్చంజ్‌ ప్రోగ్రామ్‌ కోసం యూఎస్‌ కాన్సులేట్‌ సమాజంలో వెనకబడిన, పేద విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. – సాక్షి, హైదరాబాద్‌

నాయకత్వ లక్షణాలు మెరుగయ్యాయి 
అమెరికాలో చదువుకునేందుకు నాతోపాటు అనేక మందికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. కోర్సుకు ఎంపికయ్యాక.. మాకు ఆంగ్లభాష మీద పట్టు కోసం ఏర్పాటుచేసిన క్లాసులు ఎంతో ఉపయోగపడ్డాయి. అమెరికాలో చదువు అనంతరం నాలో నాయకత్వ లక్షణాలు బాగా మెరుగుపడ్డాయి.
– పూర్ణ మలావత్, పర్వతారోహకురాలు.

మరచిపోలేని అనుభవం
ఇది మరచిపోలేని అనుభవం. మాది చాలా చిన్న కుటుంబం. విదేశాల్లో చదువుకునే అవకాశం రావడం నాకు దక్కిన వరం. వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలసి చదువుకోవడం మర్చిపోలేని అనుభూతి. నైపుణ్యాలు పెంచుకునేందుకు చక్కటి వేదిక. నా ఇంగ్లిష్‌ మెరుగుపరచుకునేందుకు టీచర్లు ఎంతగానో సాయం చేశారు. ఇపుడు జీవితంలో నా లక్ష్యం చేరుకుంటానన్న ధీమా వచ్చింది. – సంజుక్త సింగ్‌.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరిగాయి 
ఇది చాలా మంచి ప్రోగ్రామ్‌. క్యాంపస్‌లో వాతావరణం బాగుం ది. ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది పడినా క్రమంగా అలవాటయ్యింది. ఈ విద్యాభ్యాసం నా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరగడానికి ఎంతో దోహదపడింది. ఈ కోర్సు కోసం మూడు నెలలు కష్టపడ్డాను. ఆన్‌లైన్‌లో పుస్తకాలు కొన్నాను. యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులు కూడా సమాచారం విషయంలో నాకు ఎంతో సహకరించారు. – ప్రియాంక గడారి

గర్వంగా ఉంది  
ఈ అవకాశం లభించినందుకు చాలా గర్వపడ్డా. అమెరికాలో 11వ క్లాస్‌ చదివాను. అక్కడి ప్రభుత్వం గురించి తెలు సుకునే  అవకాశం దక్కింది. అలాగే  పుస్తకాలు చదవడం నా భాషా నైపుణ్యం పెంపొందించుకునేందుకు దోహదపడ్డాయి. అమెరికాతోపాటు వివిధ దేశాల సంస్కృతులూ పరిచయమయ్యాయి. –నెమలి సిద్ధార్థ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top