హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్.. ఇక వీసాల జారీ మరింత సులభతరం

US Consulate Office Opened In Hyderabad Nanakramguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ అత్యాధునిక హంగులతో నిర్మించిన సొంత భవనంలోకి మారి­పో­యింది. నానక్‌రామ్‌గూడలోని కొత్త, శాశ్వత అమెరికన్‌ కాన్సులేట్‌ భవనంలో సోమవారం కార్యకలాపాలు మొదలయ్యాయని కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సెన్‌ ప్రకటించారు. భారత్‌–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదో మైలురాయి అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వీసాల జారీని సులభతరం చేసేందుకు ఇక్కడ అధికారుల సంఖ్య పెంచుతున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు అమెరికా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2008వ సంవత్సరంలో హైదరాబాద్‌లో తొలిసారి అమెరికన్‌ కాన్సులేట్‌ ప్రారంభం కాగా, ఇప్పటివరకూ అది బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి శాశ్వత భవన నిర్మాణం కోసం నానక్‌రామ్‌ గూడలో సుమారు 12 ఎకరా­ల స్థలం కేటాయించారు. అందులోనే అమెరికా సుమారు 34 కోట్ల డాలర్ల (రూ.2,800 కోట్లు) వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించుకుంది.

చిరునామా: సర్వే నంబరు 115/1, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌ గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032. 
అత్యవసర కాన్సులర్‌ సేవల కోసం (అమెరికా పౌరులైతే) +91 040 6932 8000 నంబరులో సంప్రదించవచ్చు. 
సాధారణ సేవల కోసం ‘‘HydACS@state.gov.’’ఐడీకి మెయిల్‌ చేయవచ్చు.  
వీసా ఇంటర్వ్యూలు నిర్దిష్ట సమయాల్లో నానక్‌రామ్‌ గూడలోని కొత్త కార్యాలయంలో జరుగుతాయి. 
వీసాలకు సంబంధించిన ఇతర సరీ్వసులు (బయోమెట్రిక్స్, అపాయింట్‌మెంట్స్, ‘డ్రాప్‌బాక్స్‌’పాస్‌పోర్ట్‌ పికప్, అపాయింట్‌మెంట్స్‌ (ఇంటర్వ్యూ వెయివర్‌)లు
 మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీ మెట్రోస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘వీసా అప్లికేషన్‌ సెంటర్‌’లో కొనసాగుతాయి. 
కాన్సులర్‌ సేవలకు సంబంధించిన ప్రశ్నల కోసం +91 120 4844644 లేదా +91 22 62011000 నంబర్లను సంప్రదించవచ్చు.
చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top