
సాక్షి, హైదరాబాద్: రేపు(సోమవారం) తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. కాగజ్ నగర్, హైదరాబాద్‌లో జాతీయ రహదారులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నాగ్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్‌లో సిర్పూర్ కాగజ్ నగర్‌కు చేరుకోనున్నారు.
ఉదయం 10.15కి కాగజ్ నగర్ చేరుకోనున్న గడ్కరీ.. 10.30 నుంచి 11.30 వరకు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.45 కు కాగజ్ నగర్ నుంచి కన్హా శాంతివనం పయనం కానున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 వరకు కన్హా శాంతి వనం సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
సాయంత్రం 5 గంటలకు అంబర్ పేట ఫ్లై ఓవర్ విజిట్ అండ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు అంబర్ పేట్ గ్రౌండ్‌లో సభలో పాల్గొన్ని.. పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రాత్రి 7 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ పయనం కానున్నారు.