ఊరంతా నాటుకోడి పులుసే.. 2 వేల నాటుకోళ్లు వదిలేశారు | unidentified people abandoned two thousandchickens in Hanmakonda District | Sakshi
Sakshi News home page

ఊరంతా నాటుకోడి పులుసే.. 2 వేల నాటుకోళ్లు వదిలేశారు

Nov 9 2025 6:56 AM | Updated on Nov 9 2025 8:29 AM

unidentified people abandoned two thousandchickens in Hanmakonda District

హన్మకొండ జిల్లా: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రెండు వేలకు పైగా నాటుకోళ్లను వదిలి వెళ్లారు. దీంతో ఎల్కతుర్తివాసులు మొత్తం.. పత్తి చేలలో పరుగెత్తారు. దొరికిన కాడికి కోళ్లను పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. గంట వ్యవధిలో కోళ్ల అరుపులతో ఊరు ఊరంతా దద్దరిల్లింది.  కొంతమంది వెంటనే నాటు కోడి పులుసు చేసుకుని సంతోషంగా విందు చేసుకున్నారు. 

సోషల్‌ మీడియాలో ఈ వీడియోలు వైరలయ్యాయి. కాగా, కోళ్లలో వ్యాధి ఉందనే వదంతులు చక్క ర్లు కొడుతుండగా.. ఎల్కతుర్తి పశువైద్యాధికారి దీపిక వాటిని ఖండించారు. కోళ్లలో ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని, శాంపిల్స్‌ను వరంగల్‌ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. కోళ్లు వదిలివెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని తేల్చేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement