నాలుగు నెలల బాబు కోసం ఇద్దరి తల్లుల వివాదం 

Two Women Dispute About 4 Months Baby At Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగరంలోని ఆనంద్‌ నగర్‌లో నాలుగు నెలల బాబుకోసం ఇద్దరు తల్లుల మధ్య వాగ్వివాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలూరు గ్రామానికి చెందిన ఇందిర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో తనకు బాబు పుట్టగానే రూ.40 వేలకు ఆకుల కొండూరుకు చెందిన సునీతకు విక్రయించింది. అయితే ఇందిర గురువారం తన బిడ్డ తనకు కావాలని సునీత తల్లితో కలిసి నివసించే ఆనంద్‌నగర్‌లోని ఇంటికి వెళ్లింది. సునీతతో వాగ్వివాదానికి దిగి ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం తెలుసుకున్న 5వ టౌన్‌ పోలీసులు విచారణ జరిపి బాబును ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. కాగా పోలీసు స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top