ఉచిత ప్రయాణం: కండక్టర్‌తో మహిళా వాగ్వాదం.. రెండూ ఒకటే కదా..

TS: Women Arguing With Conductor For Free Journey ID Card Issue - Sakshi

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పట్ల చోట్ల బస్సుల్లో కండక్టర్లకు మహిళలకు, డ్రైవర్లకు మహిళలు మధ్య వాగ్వాదాలు జరుగుతున్న పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా ఓ యువతి ఫోన్‌లో ఆధార్‌ కార్డు నంబర్‌ చూపి.. బస్సులో ప్రయాణానికి అనుమతి ఇవ్వావాలని కండక్టర్‌తో గొడవకు దిగింది. అక్కడితో ఆగకుండా ఒరిజినల్‌ ఆధార్‌, ఫోన్‌లో ఉండే ఆధార్‌ నంబర్‌ ఒకటే కాదా అని కండక్టర్‌తో వాదించింది. దీని సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది.

అయితే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే.. కచ్చింతంగా  ఆధార్‌ కార్డు/ ఓటర్‌ ఐడీ కార్డు/ పాస్‌ పోర్టు వంటి గుర్తింపు కార్డులు చూపించాలని మార్గదర్శకాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కండక్టర్లు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపించాలని మహిళలను కోరుతున్నారు. ఇటువంటి సమయంలోనే పలు​ చోట్లు బస్సుల్లో గొడవలకు దారి తీస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top