పీజీ సెట్‌ షెడ్యూల్‌ విడుదల | Sakshi
Sakshi News home page

పీజీ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

Published Sat, Feb 25 2023 1:33 AM

TS PGECET 2023 Schedule Released Prof R Limbadri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ పీజీఈ సెట్‌–2023 షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్‌ ఈ పరీక్షను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కోసం ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.600)తో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం https:// pgecet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వాలని ఆయన సూచించారు.   

Advertisement
Advertisement