గంటసేపట్లో పునరుద్ధరించండి

TS High Court Order To Restore Electricity And Water Supply In OU Hostels - Sakshi

ఓయూ హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాపై హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: దసరా సెలవుల కారణం చెప్పి ఉస్మానియా వర్సిటీలోని హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను ఆపడం సరికాదని.. గంటసేపట్లో పునరుద్ధ రించాలని అధికారులను హైకోర్టు ఆదే శించింది. అలా చేయని పక్షంలో రిజి స్ట్రార్‌ తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. వర్సిటీ అధికారులు దసరా సెలవులను తొలుత అక్టోబర్‌ 3 నుంచి 10 వరకు పేర్కొ న్నారు. తర్వాత 26 వరకు పొడిగిండంతో పాటు విద్యుత్, నీటి సరఫరా నిలి పేశారు.

వీటిని పునరుద్ధరించేలా ఆదే శాలివ్వాలని కోరుతూ ఎల్‌ఎల్‌బీ విద్యా ర్థులు నెరెళ్ల మహేశ్‌గౌడ్‌తో పాటు మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించి లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం విచా రణ చేపట్టారు. పిటిషన్‌ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎల్‌ఎల్‌బీ వి ద్యార్థులు, గ్రూప్‌–1 అభ్యర్థులు పరీక్ష లకు సిద్ధమవుతున్నారన్నారు. హాస్టళ్ల లో చదువుకుంటున్న విద్యార్థుల్లో చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థు లేనని వెల్లడించారు. వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మరమ్మతులు చేయడం కోసం సరఫరా నిలిపినట్లు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విద్యుత్, నీటి సరఫరా ను పునరుద్ధరించాలని ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top