రక్తహీనత నివారణకు సమగ్ర ప్రణాళిక: గవర్నర్‌ 

TS Governor Tamilisai Calls For Comprehensive Action Plan To Prevent Anaemia - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రక్తహీనత సమస్య నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలను కోరారు. పాఠశాల విద్యార్థుల్లో రక్తహీనత పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్‌.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాన్ని నివారించాలని కోరారు. రక్తహీనత నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు గవర్నర్‌ సోమవారం ఎన్‌ఐఎన్‌ను సందర్శించారు.

దేశ భవిష్యత్‌ అయిన  విద్యార్థుల్లో రక్తహీనత సమస్య కొనసాగడం సరికాదని శాస్త్రవేత్తలతో అన్నారు. ఈ ఏడా దిని చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన గవర్నర్‌.. వాటి ద్వారా పోషకాహార లోపాలను అధిగమించవచ్చన్న విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top