కలెక్టరేట్‌లో సర్పంచ్‌ దంపతుల ఆత్మహత్యాయత్నం.. రేవంత్‌ రియాక్షన్‌ ఇదే

TPCC Revanth Reacts Nadipet Surpanch Couple Suicide Attempt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాల్లో నందిపేట సర్పంచ్‌ దంపతులు.. సాంబారు వాణి, తిరుపతి సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం బిల్లులు రాకపోవడంతో గ్రామంలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నానని, అప్పులు చేసి అభివృద్దివ చేశానని తిరుపతి వాపోయారు.

ఇక, ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. రేవంత్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ఊరి కోసం అప్పు చేసి అభివృద్ధి చేసిన పాపానికి నిజామాబాద్ జిల్లా, నందిపేట సర్పంచ్ దంపతులు కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో కూర్చుని సర్పంచ్‌లకు ఒక్క రూపాయి బాకీలేమని సిగ్గు ఎగ్గులేకుండా ప్రకటించే బానిస మంత్రులు దీనికి ఏం సమాధానం చెబుతారు?’ అంటూ ప్రశ్నించారు. 

ఇదీ జరిగింది.. 
సాక్షి, నిజామాబాద్‌/సుభాష్‌నగర్‌ : ‘నాలుగేళ్లుగా సర్పంచ్‌గా కొనసాగుతున్నాను. బడుగు, బలహీనవర్గానికి చెందిన వాడిని. 20 ఏళ్లుగా సేవచేస్తూ సర్పంచ్‌గా గెలుపొందాను. అభివృద్ధి పనుల కోసం రూ. 2కోట్ల వరకు ఖర్చు చేశాను. చెక్కులపై ఉపసర్పంచ్‌ సంతకాలు పెట్టడంలేదు. బీఆర్‌ఎస్‌లో చేరితే బిల్లులు మంజూరవుతాయనే ఆశతో పార్టీ మారాను. వడ్డీ కలుపు కు ని రూ. 4కోట్ల వరకు అప్పులయ్యాయి. పలుమా ర్లు కలెక్టర్, డీపీవో దృష్టికి తీసుకొచ్చాను.. నందిపేట్‌ ప్రజలు క్షమించాలి. బిల్లులు రాక అభివృద్ధి పనులు చేయలేక మొహం చాటేస్తున్నాను. సిగ్గుతో తలదించుకుంటున్నాను’ అని రోదిస్తూ నందిపేట సర్పంచ్‌ దంపతులు సాంబారు వాణి, తిరుపతి సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

గమనించిన స్థానికులు, జర్నలిస్టులు అగ్గిపెట్టె లాక్కున్నా రు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కాగా పెట్రోల్‌ బాటిల్, అగ్గిపెట్టెతో కలెక్టరేట్‌లోకి రావడంతో భద్రతా సిబ్బంది కంగుతిన్నారు. కలెక్టర్‌ వచ్చే వరకూ కదిలేది లేదని భీషి్మంచారు. అక్క డి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాదించారు. డీపీవో వచ్చి వారిని సముదాయించారు. సర్పంచ్‌ దంపతులపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్‌ రూరల్‌ ఎస్సై లింబాద్రి తెలిపారు. 

అప్పుల పాలయ్యాం 
బిల్లులు రాకపోవడంతో గ్రామంలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నానని తిరుపతి వాపోయారు. అభివృద్ధి, సేవ చూసి విదేశాలు, అమెరికా నుంచి, ప్రముఖులు అవార్డులు అందజేశారని తెలిపారు. అప్పుల దిగులుతో తన భార్య వాణి ఆస్పత్రి పాలైందని, నేరుగా ఆస్పత్రి నుంచి ఇక్కడికి వచ్చామన్నారు. భార్యనే బతికించుకోలేని వాడిని, ఊరు ను ఏం ఉద్దరిస్తానని విలపించాడు. 

సర్పంచ్‌ వ్యవస్థను నాశనం చేశారు.. 
ఉప సర్పంచులకు చెక్‌పవర్‌ ఇచ్చి సర్పంచ్‌ వ్యవస్థను నాశనం చేశారని సర్పంచ్‌ భర్త తిరుపతి ఆరోపించారు. బీజేపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందిన నాటి నుంచి అనేక వేధింపులు ఎదుర్కొన్నానని, అట్రాసిటీ కేసుతో మూడేళ్లపాటు బాధను అను భవించానని రోదించారు. గ్రామ భూములు అమ్ముకున్నానని, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశానని సస్పెండ్‌ చేస్తే.. కోర్టుకెళ్లి మళ్లీ తెచ్చుకున్నా నని వివరించారు. వివిధ ఆరోపణలు చేస్తూ రెండున్నరేళ్ల పాటు చెక్‌పవర్‌ తొలగించారని, అయినా గ్రామాభివృద్ధికి నిధులు ఖర్చు చేశానని తెలిపారు. చివరకు పార్టీ మారినా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బిల్లులు, చెక్‌పవర్‌ ఇప్పించలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది మీకు తగునా.. కొన్ని సామాజికవర్గాలే కని్పస్తున్నాయా.. బడుగు, బలహీన వర్గాలు కని పించడం లేదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం: డీపీవో 
నందిపేట సర్పంచ్‌ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి ప్రజావాణిలో ఉపసర్పంచ్‌పై ఫిర్యాదుచేశారని డీపీవో జయసుధ తెలిపారు. చెక్కులపై సంతకాలు చేయడం లేదని, గ్రామాభివృద్ధికి సహకరించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టి, పంచాయతీరాజ్‌ యాక్ట్‌–2018 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని డీపీవో వారికి హామీనిచ్చారు. కాగా సర్పంచ్‌గా ఉండి ఉపసర్పంచ్‌ కాళ్లు మొక్కే పరిస్థితి ఎదురైందని, ఈ ఉపసర్పంచ్‌ వద్దని చెప్పినా విని్పంచుకోలేదని వాపోయారు. ఒక డిజిటల్‌ టోకెన్‌(పెన్‌డ్రైవ్‌)తో సర్పంచ్‌గా పని చేయలేనని, తనకు వద్దని అధికారులకు ఇచ్చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top