బ్లాక్‌క్యాట్, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌, మార్షల్స్‌తో ఎంపీకి పటిష్ట భద్రత

Tight Security for Nizamabad MP Arvind Dharmapuri with Blackcat - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తన జిల్లా పర్యటనలో ప్రతిసారి టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆటంకాలు కలిగించడం.. వాగ్వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో బీజేపీ ఎంపీ అర్వింద్‌ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యాలయం సూచనల మేరకు వీఆర్‌ఎస్‌ తీసుకున్న బ్లాక్‌క్యాట్, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌తో పాటు నలుగురు మార్షల్స్‌తో ఎంపీ సొంత డబ్బులతో భద్రత కల్పించుకున్నారు. కాగా రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య ముక్కో ణపు పోటీ నడుస్తోంది.

గత ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరపున ధర్మపురి అర్వింద్, కల్వకుంట్ల కవితపై అనూహ్యంగా విజయం సాధించారు.  అప్పటి నుంచి బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఘర్షణల దాకా వెళ్లింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఇతర అంశాలపై బీజేపీ ఆందోళ నలు చేస్తే, ప్రతిగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పసుపు బోర్డు విషయంలో ఆందోళనలు చేస్తూ ఎంపీ అర్వింద్‌ను అ డ్డుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఆరు నెలల కా లంలో ఇరుపార్టీల శ్రేణుల మధ్య పలుసార్లు ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కొన్ని నెలలుగా ఎంపీ పర్యటన చేసిన ప్రతిసారి టీఆర్‌ఎస్‌ శ్రేణు లు మోహరిస్తుండడంతో ని యంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైపోతోంది. రెండు సందర్భాల్లో పోలీసులు సైతం తీవ్రంగా గాయపడడం గమనార్హం.

చదవండి: (ఎంపీ అర్వింద్‌ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత)

ఇటీవల కాలంలో ఎంపీ అర్వింద్‌ పలుచోట్ల పర్యటనలు, ప్రారంభో త్సవాలు చేసేందుకు, మరి కొన్నిచోట్ల ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాలు ఆవిష్కరించేందుకు వచ్చిన సందర్భంలో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వరుసగా ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి మండల కేంద్రంలో, భీంగల్‌ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు మరణించిన సందర్భంలో, ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి ప్రాంతంలో ఎంపీ అర్వింద్‌ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ లు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండడంతో పోటాపోటీ నెలకొంది. ఎంపీ అర్వింద్‌ ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ విషయంలో పోలీసు లు టీఆర్‌ఎస్‌కు సహకరించి తన భద్రతకు సహకరించలేదంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌పై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు.

అధికారికంగా హోంశాఖ నుంచి భద్రత కల్పించే విషయంలో ఆలస్యం అయ్యే నేపథ్యంలో అమిత్‌షా కార్యాలయం సూచనల మేరకు ఎంపీ అర్వింద్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్న బ్లాక్‌క్యాట్‌ కమెండో, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌తో పాటు నలుగురు మార్షల్స్‌ను తన భద్రతా వలయంగా నియమించుకున్నారు. అలాగే కిలోమీటర్‌ రేడియస్‌లో పనిచేసే విధంగా 5 వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి తన పర్యటనలో దాడులకు పాల్పడితే టీఆర్‌ఎస్‌ వాళ్లకు తూటాలు దిగుతాయని ఎంపీ అర్వింద్‌ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top