పిడుగుపాటుకు ముగ్గురు బలి

Three Women Were Passed Away For Lightning Strike In Bhupalpally District - Sakshi

భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు మహిళలు..

ములుగు జిల్లాలో ఒక మహిళ మృతి.. 

భూపాలపల్లి రూరల్‌/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో సోమవారం పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతిచెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపా లపల్లి మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో ఇద్దరు, ము లుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో ఒక మహిళ మృతిచెందారు. ఈ రెండు ఘటనలు వరి పొలంలో కలుపుతీస్తుండగా జరిగాయి.

భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్‌ భార్య గట్టు లక్ష్మి (40) తన వ్యవసాయ పొలంలో కలుపు తీసేందుకు అదే గ్రామానికి చెందిన పసరగొండ మంజుల (38)ని కూలికి తీసుకెళ్లింది. సోమవారం సాయంత్రం సమయంలో వర్షం రావడంతో ఇద్దరు కవరు కప్పుకొని పొలం గట్టుపై కూర్చు న్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మరణించారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మృతుల కుటుంబ సభ్యులను ప రామర్శించారు. మరోఘటనలో ములుగు జిల్లా ఏటూరునా గారం మండలం శంకరాజుపల్లికి చెందిన ఆతుకూరి లాలమ్మ తన కుమార్తె రమ్య (20)తో కలిసి సోమవారం పంట పొలాల్లోకి కూలి పనికి వెళ్లింది. వీరికి సమీపంలో పిడుగు పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా రమ్య మృతి చెందింది. లాలమ్మ కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top