రూ.వెయ్యి కోట్లతో తండాల అభివృద్ధి | Thandala Development With Rs 1000 Crores: Satyavathi Rathod | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోట్లతో తండాల అభివృద్ధి

Aug 19 2022 2:36 AM | Updated on Aug 19 2022 1:26 PM

Thandala Development With Rs 1000 Crores: Satyavathi Rathod - Sakshi

పాఠశాల ఆవరణలో మొక్క నాటి నీళ్లు పోస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌ 

జిన్నారం (పటాన్‌చెరు): రాష్ట్రంలోని అన్ని తండాలను రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల 75వ వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆమె వీక్షించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులతో మాట్లాడి వారికి విద్య, భోజనం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 193 గిరిజన పాఠశాలలను డిగ్రీ వరకు అప్‌గ్రేడ్‌ చేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement