కరోనాతో యువ వైద్యుడు మృతి | Telangana: Young Doctor Died With Covid In Chennur, Mancherial District | Sakshi
Sakshi News home page

కరోనాతో యువ వైద్యుడు మృతి

May 14 2021 8:51 AM | Updated on May 14 2021 10:17 AM

Telangana: Young Doctor Died With Covid In Chennur, Mancherial District - Sakshi

కరోనా కాటుకు మరో వైద్యుడు బలయ్యాడు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న వైద్యులు కరోనాతో మృతి చెందడం కలచివేస్తోంది.

కోటపల్లి (చెన్నూర్‌): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన యువ వైద్యుడు రావుల రాజేశ్‌ (30) గురువారం కరోనా వైరస్‌తో మృతిచెందాడు. రాజేశ్‌ కరోనా బారిన పడి తొమ్మిది రోజులుగా హన్మకొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి రాజేశ్‌ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రాజేశ్‌ ఫాండీ అనే ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సును పూర్తి చేసి హన్మకొండలో స్థిరపడ్డాడు. నాలుగేళ్లుగా అక్కడే మాక్స్‌కేర్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. అతను వ్యాక్సిన్‌ వేసుకుని ఉంటే వ్యాధి తీవ్రత ఇంతగా ఉండేది కాదని బంధువులు పేర్కొన్నారు. రాజేశ్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చదవండి: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు
చదవండి: ఢిల్లీకి ‘ఊపిరి’: ఆక్సిజన్‌పై కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement