Corona Vaccine: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు

Covishield Vaccine Gap For 12 To 16th Week NTAGI Recommends - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెరిగింది. రెండో డోసు 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇదివరకు 28 రోజుల నుంచి ఆరు వారాల వ్యవధిలో వేసుకోవాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. వాక్సిన్ బెటర్ రిజల్ట్స్ కోసం గ్యాప్ ఎక్కువగా ఉండాలని సూచించింది.

కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఆరు నెలల తర్వాత యాక్షన్ తీసుకోవాలని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ (ఎన్‌టీఏజీఐ) పేర్కొంది. డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సూచనలు చేసింది. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్‌ రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. కోవాగ్జిన్‌ డోసుల మధ్య ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేసింది.
 

నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సిఫారసులు

 • కరోనా రోగులకు కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకాలు వేయాలి. ప్రస్తుతం కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్ ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత టీకాలు ఇచ్చినట్లయితే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
   
 • వ్యాక్సిన్ మొదటి మోతాదు ఇచ్చిన తర్వాత కరోనా సోకితే.. వారికి కోలుకున్న 4-8 వారాల తర్వాత రెండవ మోతాదు ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు కోలుకున్న 14 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తున్నారు.
   
 • చికిత్స సమయంలో ప్లాస్మా థెరపీ చేసిన రోగులకు కోలుకున్న 12 వారాల తర్వాత వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ పేషెంట్స్‌కు నిర్దిష్ట నియమం అంటూ ఏం లేదు. కోలుకున్న 14 రోజుల తర్వాత వ్యాక్సిన్ మొదటి షాట్ ఇస్తున్నారు.
   
 • ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత టీకా ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు ప్రత్యేక ప్రోటోకాల్ లేదు. దుష్ప్రభావాలు లేకుండా ఉండాలంటే వ్యాక్సిన్‌కు గ్యాప్ తప్పనిసరి అంటున్నారు.
   
 • టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అవసరం లేదు.
   
 • కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12-16 వారాలకు పెంచాలి. ప్రస్తుతం, 4-8 వారాల మధ్య రెండు డోస్ ఇస్తుండగా.. లాన్సెట్ అధ్యయనం ప్రకారం, 12 వారాల విరామం ఉంటే టీకా ప్రభావాన్ని 81.3% పెంచుతుందని తెలుస్తోంది. ఈ ప్రోటోకాల్ బ్రిటన్‌లో అనుసరిస్తున్నారు.
   
 • గర్భిణీ స్త్రీలకు యాంటినెటల్ సెంటర్లలో టీకాలకు సంబంధించిన లాభాలు, నష్టాలు గురించి తెలియజేయాలి. సైడ్ ఎఫెక్ట్స్‌పై ఒక బుక్‌లెట్ వారికి అందించాలి. వారికి టీకా వేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. పాలిచ్చే తల్లులు డెలివరీ తర్వాత ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని తెలిపింది.

చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్‌ హల్‌చల్‌.. పోలీసుల ఎన్‌కౌంటర్‌
చదవండి: కౌశిక్‌రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-05-2021
May 13, 2021, 19:21 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 4,693 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,16,404కు చేరింది. గడిచిన...
13-05-2021
May 13, 2021, 19:12 IST
సాక్షి,న్యూఢిల్లీ: క్రిప్టో బిలియనీర్,ఎథీరియం సహ వ్యవస్థాపకుడు  విటాలిక్ బుటెరిన్  భారతదేశ కోవిడ్ రిలీఫ్ కోసం  భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఒక బిలియన్...
13-05-2021
May 13, 2021, 18:09 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 96,446 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,66,785...
13-05-2021
May 13, 2021, 17:34 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా మే 1...
13-05-2021
May 13, 2021, 16:58 IST
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్‌ పేరెంట్స్‌ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని చహల్‌ భార్య ధనశ్రీ వర్మ...
13-05-2021
May 13, 2021, 16:27 IST
సాక్షి, అమరావతి : కరోనా విపత్తను ఎదుర్కోవడానికి సీఎంఆర్‌ఎఫ్‌లో భాగస్వాములు కావాలని మంత్రి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు పరిశ్రమలు...
13-05-2021
May 13, 2021, 16:02 IST
శ్రీనగర్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు, మల్టీనేషనల్‌ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలను ఇచ్చాయి. చాలామంది కరోనా బాధితులకు తమవంతు...
13-05-2021
May 13, 2021, 15:35 IST
బెంగ‌ళూరు: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ప్రతి రోజు లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. సామాజిక దూరం పాటించండి, మాస్క్‌...
13-05-2021
May 13, 2021, 15:30 IST
సాక్షి, కృష్ణా : కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లోని చిన్నపిల్లల రక్షణ కోసం చైల్డ్‌కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
13-05-2021
May 13, 2021, 15:29 IST
బెంగళూరు: బెంగళూరులో షాకింగ్‌ ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలియక తల్లీ, సోదరుడి మృతదేహాల పక్కనే  మతిస్థిమితింలేని ఒక...
13-05-2021
May 13, 2021, 14:28 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనుషులతో పాటు మానవత్వాన్ని మింగేస్తుంది. ఓవైపు ప్రజలు కోవిడ్‌తో అల్లాడుతుంటే.. దీన్ని అదునుగా తీసుకుని కొందరు...
13-05-2021
May 13, 2021, 10:43 IST
న్యూఢిల్లీ: కరోనా టీకాపై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రధానంగా గర్భిణులు ఈ టీకా తీసుకోవచ్చా? లేదా? అనే దానిపై...
13-05-2021
May 13, 2021, 09:20 IST
న్యూఢిల్లీ: భారత్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్‌ చంద్రశేఖర్‌ (64) కరోనాతో కన్నుమూశారు. మూడుసార్లు...
13-05-2021
May 13, 2021, 06:27 IST
‘‘కోవిడ్‌ బాధితులకు మనం ఎంతో కొంత సహాయం చేయాలి’’ అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఇందులో భాగంగా నేను సైతం అంటూ...
13-05-2021
May 13, 2021, 06:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ పరిస్థితి చక్కబడాలంటే పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను...
13-05-2021
May 13, 2021, 05:23 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఈ ప్రభావం...
13-05-2021
May 13, 2021, 05:21 IST
ఆ రంగం ఈ రంగం అని లేదు.. ఇప్పుడు అన్ని రంగాల వారు కరోనాతో బాధపడుతున్నారు. ఐటీ రంగమూ ఇబ్బందిపడుతోంది....
13-05-2021
May 13, 2021, 05:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌తో ప్రాణాలుపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య రెండున్నర...
13-05-2021
May 13, 2021, 05:12 IST
జెనీవా: విషయంలో వరుసగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ దారుణ సంక్షోభ పరిస్థితి నెలకొన్నదని కోవిడ్‌ 19పై అధ్యయనం...
13-05-2021
May 13, 2021, 04:42 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్‌ సమస్యను తీర్చేందుకు డీఆర్‌డీవో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. బాధితుల శరీరంలోని మోతాదులకు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top