అర్ధరాత్రి రౌడీ షీటర్‌ హల్‌చల్‌.. పోలీసుల ఎన్‌కౌంటర్‌

Karnataka: Rowdy Sheeter Attack With Knife And Police Shot His Leg - Sakshi

బనశంకరి: పరారీలో ఉన్న రౌడీ షీటర్‌ను పట్టుకోవడానికి వెళ్లగా పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్‌పై చాకుతో గాయపరచడంతో పోలీసులు గన్‌కు పని బెట్టారు. నిందితుడిని అదుపులోకి చేసేందుకు పోలీసులు కాలిపై కాల్పులు జరపడంతో రౌడీ షీటర్‌ కిందపడిపోయాడు. కిందపడిన అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కర్నాటకలోని బనశంకరి ప్రాంతంలో జరిగింది.

రామమూర్తినగరకు చెందిన సూర్య అలియాస్‌ జెట్టి రెండు హత్యలు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రౌడీ షీటర్‌గా గుర్తింపు పొందాడు. ఇతడి ముఠా ఈ నెల 4వ తేదీన రఘురామ్‌ అనే వ్యక్తిపై దాడి చేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతడు ఒకచోట ఉన్నాడని తెలుసుకుని వెళ్లగా పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ఏసీపీ పరమేశ్వర్‌ నేతృత్వంలో మంగళవారం అర్ధరాత్రి హెచ్‌బీఆర్‌ లేఔట్‌ రెండోక్రాస్‌లోని ఓ ఇంటిపై దాడి చేశాడు.

అతడిని పట్టుకోబోగా చీకట్లో పారిపోయాడు. సమీపంలో కానిస్టేబుల్‌ హనుమేశ్, సూర్యలపై చాకుతో దాడి చేశాడు. దాడికి దిగడంతో విధిలేక ఏసీపీ పరమేశ్వర్‌ కాల్పులు జరిపాడు. జెట్టి కాలికి కాల్పులు చేయడంతో గాయమై కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు ఆ రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రౌడీ షీటర్‌ చేతిలో గాయపడిన పోలీసులను కూడా ఆస్పత్రికి తరలించారు.

చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా
చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top