తెలంగాణ స్క్వాష్‌ క్లోజ్డ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ షురూ  | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్క్వాష్‌ క్లోజ్డ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ షురూ 

Published Sat, Aug 19 2023 6:47 AM

Telangana State Closed Squash Championship tourney - Sakshi

లక్డీకాపూల్‌: తెలంగాణ స్క్వాష్‌ క్లోజ్డ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లోని గేమ్‌పాయింట్‌ హైటెక్‌ ఎరీనాలో జరిగే ఈ టోరీ్నలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్‌పాయింట్‌తో కలిసి తెలంగాణ స్క్వాష్‌ రాకెట్స్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని అగ్రశ్రేణి జూనియర్‌ ప్లేయర్లు తనుజ్‌ రెడ్డి పులి, అర్నా ద్వివేది, సాన్వి శ్రీతో పాటు పురుషుల, మహిళల టాప్‌ ర్యాంకర్లు రోహన్‌ ఆర్యగోండి, ఐశ్వర్య పయ్యన్‌ బరిలో ఉన్నారు. బాలుర అండర్‌–11, అండర్‌–13, అండర్‌–15, బాలికల అండర్‌–13, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.

పురుషుల 35, 45 వయో విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. శనివారం క్వార్టర్‌ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్‌ జరుగనున్నాయి. రాష్ట్రానికి చెందిన స్క్వాష్‌ క్రీడాకారులకు గొప్ప వేదిక అయిన తెలంగాణ స్క్వాష్‌ క్లోజ్డ్‌ చాంపియన్‌ షిప్‌ను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు టోర్నమెంట్‌ చైర్మన్‌ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఏజ్‌ గ్రూప్‌ పోటీల్లో అగ్ర ఆటగాళ్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి టోర్నమెంట్‌లో బలమైన పోటీ ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement