
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ పోలీసు శాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం కారణంగా ఎస్‌ఐ రాజేశ్వర్ మృతి చెందారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
వివరాల ప్రకారం.. ఫిల్మ్ నగర్ ఎస్‌ఐ రాజేశ్వర్ నిన్న రాత్రి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో చేర్యాల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా రాజేశ్వర్ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీలో నివాసం ఉంటున్నారు.