ఒక్క రోజే 3,877 కరోనా కేసులు | Telangana Reports 3, 877 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: ఒక్క రోజే 3,877 కరోనా కేసులు

Jan 29 2022 4:11 AM | Updated on Jan 29 2022 4:41 PM

Telangana Reports 3, 877 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం రాష్ట్రంలో 1.01 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,877 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.54 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 2,981 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తంగా 7.10 లక్షల మంది రికవరీ అయ్యారు.

ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు 4,083 మంది కరోనాతో మృతిచెందారు. ఇక ప్రస్తుతం 40,414 క్రియాశీలక కరోనా కేసులుండగా.. వాటిల్లో 3,341 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 840 మంది ఐసీయూలో, 1,408 మంది ఆక్సిజన్‌పై ఉన్నారు. మిగిలిన వారు ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement