గైడ్లకు రూ.లక్ష.. ఆపరేటర్లకు రూ.10 లక్షలు | Sakshi
Sakshi News home page

గైడ్లకు రూ.లక్ష.. ఆపరేటర్లకు రూ.10 లక్షలు

Published Tue, Sep 14 2021 4:01 AM

Telangana To Provide Financial Aid Of Rs 10 Lakh: Kishan Reddy - Sakshi

(గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): నవంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని, టూర్‌ గైడ్లకు రూ.లక్ష చొప్పున, ఆపరేటర్ల(సంస్థలు)కు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది, రిజిస్ట్రేషన్లు ఉన్న గైడ్లు, ఆపరేటర్లకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు.

కరోనా కారణంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నందున, వారిని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని చెప్పారు. మొత్తంగా 10 వేల మంది గైడ్లకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సోమవారం ఈశాన్య రాష్ట్రాల మంత్రుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2022, జనవరి 1 నుంచి దేశ, విదేశ పర్యాటకుల కోసం దేశంలోని పర్యాటక కేంద్రాలను తెరవాలని భావిస్తున్నామని అన్నారు.

అయితే, ఈ ప్రతిపాదనకు ప్రధాని మోదీ, హోం, విదేశాంగ ఇతర శాఖల నుంచి ఆమోదం లభించాల్సి ఉందని వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తికానుందని చెప్పారు. ఒలింపిక్స్, కామన్వెల్త్, పారాలింపిక్స్‌ వంటి క్రీడల్లో భారత్‌ మరిన్ని పతకాలు సాధించేందుకు మణిపూర్‌లోని ఇంఫాల్‌ సమీపంలో జాతీయ క్రీడల విశ్వవి ద్యాలయాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నామని మంత్రి వివరించారు. వచ్చే రెండేళ్లలో దేశంలోని వంద విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement