ఐయూఎన్‌ఎస్‌ సభ్యుడిగా డాక్టర్‌ భానుప్రకాశ్‌ రెడ్డి 

Telangana: NIN Scientist Elected Fellow Of IUNS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్త, బయో కెమిస్ట్రీ విభాగ అధ్యక్షుడు జి.భానుప్రకాశ్‌రెడ్డి పోషక శాస్త్రాల అంతర్జాతీయ సమాఖ్య (ఐయూఎన్‌ఎస్‌) సభ్యుడిగా ఎన్నికయ్యారు. పోషక శాస్త్రాల అభివృద్ధికి భానుప్రకాశ్‌ రెడ్డి చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. ఎన్‌ఐఎన్‌లో పాతికేళ్లుగా పని చేస్తున్న డాక్టర్‌ రెడ్డి అసాంక్రమిక ఆరోగ్య సమస్యల్లో కణస్థాయి పోషకాలపై పలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు అంతర్జాతీయ జర్నల్స్‌లో 190 పరిశోధన పత్రాలను ప్రచురించారు. దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో విటమిన్‌–ఏ స్థాయిలపై డాక్టర్‌ భానుప్రకాశ్‌ రెడ్డి చేసిన విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా విటమిన్‌–ఏ సప్లిమెంటేషన్‌ విధానాన్ని మెరుగుపరిచింది. మధుమేహ వ్యాధిలో వచ్చే సమస్యలకు సూక్ష్మ పోషకాల పాత్రపై కూడా డాక్టర్‌ రెడ్డి పరిశోధనలు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top