TS: రాష్ట్రంలో కొత్తగా 710 కరోనా కేసులు | Telangana New Corona Virus Positive Cases Report | Sakshi
Sakshi News home page

TS: రాష్ట్రంలో కొత్తగా 710 కరోనా కేసులు

Jul 15 2021 8:39 PM | Updated on Jul 15 2021 8:45 PM

Telangana New Corona Virus Positive Cases Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 710 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,34,605కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,101 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటలల్లో 808 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement