
హైదరాబాద్: సృష్టి పెర్టిలిటీ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయ్యింది. సుమోటోగా తీసుకుని ఎథిక్స్ కమిటీలో విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు.
2016లో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్‌న మెడికల్ కౌన్సిల్ ఐదేళ్లు రద్దు చేయగా, 2021లో TGMC కి మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారని డాక్టర్ నమ్రత. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటంతో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్‌న పునరుద్ధరించలేదన్నారు. అయితే అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్‌ను నడుపుతూ దొరికిపోవడంతో సదరు సెంటర్ పై ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
కాగా, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్దారణలోతేలింది. eదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ బయట పెట్టారు.
ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.
సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్. మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.
ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్‌ఏ అని తేలింది. డాక్టర నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు.
అక్రమ బాగోతం ఎలా వెలుగుచూసిందంటే..!
పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్‌ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు.