Telangana: కొత్తగా 9 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 5,262 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 9 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది.
కాగా, రాష్ట్రంలో ఎక్స్‌బీబీ1.5 వేరియంట్ కేసులు నమోదయ్యాయని గ్లోబల్ ఇన్షియేటివ్ ఆన్ షేరింగ్ ఇన్‌ఫ్లుయెంజా డాటా (జీఐఎస్‌ఏఐడీ) వెల్లడించింది. నాలుగు వారాల క్రితం ఎక్స్‌బీబీ1.5 సబ్ వేరియంట్ కేసులు దేశంలో 10 నమోదు కాగా, అందులో నాలుగు కేసులు మహారాష్ట్రలో, మూడు కేసులు తెలంగాణలో, మరో మూడు కేసులు గుజరాత్‌లో నమోదయ్యాయి.
మరిన్ని వార్తలు :