తెలంగాణ: అన్‌లాక్‌ మార్గదర్శకాలు విడుదల

Telangana Lifts Lockdown: Cabinet Key Decisions And Unlock Guidelines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో సర్కారు తాజాగా అన్‌లాక్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. మాస్కు ధరించడం తప్పనిసరి అని, లేనిపక్షంలో వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆఫీసులు, దుకాణాలు తదితర జనసమ్మర్థం ఎక్కువగా ఉండే చోట్ల కోవిడ్‌ నిబంధనలు పాటించాలని పేర్కొంది. అదే విధంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో శనివారం భేటీ అయిన మంత్రివర్గం ఆస్పత్రుల నిర్మాణ విషయమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

తెలంగాణలో అన్‌లాక్‌ గైడ్‌లైన్స్
జులై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు పునఃప్రారంభం
భౌతిక దూరం, మాస్క్‌ తప్పనిసరి
మాస్క్‌ లేకుంటే వెయ్యి రూపాయల ఫైన్‌
కార్యాలయాలు, దుకాణాల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
నిబంధనలు పాటించకుంటే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద చర్యలు

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
హైదరాబాద్‌లో 3 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆమోదం
టిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని నిర్ణయం
చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ ప్రాంగణాల్లో ఆస్పత్రుల నిర్మాణం
అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆస్పత్రి నిర్మాణం

చదవండి: Telangana Lockdown Update: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top