Telangana: జేఈఈ మెయిన్స్‌ తొలి దశ పరీక్షలు

Telangana Jee Mains 2022 Exam Begin - Sakshi

29 వరకూ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఐడీ ఫ్రూఫ్‌.., కోవిడ్‌ లేదని హామీ పత్రం ఇవ్వాలి

సెక్షన్‌ బీలోనూ నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్‌ తొలి దశ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 1.90 లక్షల మంది హాజరవనున్నారు. ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విద్యార్థు లకు అడ్మిట్‌ కార్డులు జారీ చేసింది.

కోవిడ్‌ తర్వాత జరిగే మెయిన్స్‌ ఈసారి భిన్నంగా ఉంటుం దని ఎన్‌టీఏ తెలి పింది. రాష్ట్రాల పరిధిలోని వివిధ బోర్డులు ఇంటర్, తత్సమాన స్థాయి పరీక్షల్లో 70% సిలబస్‌ను మాత్రమేబోధించాయి. అయితే జేఈఈలో మాత్రం ఈ నిబంధన వర్తించే అవకాశం లేదు. కాకపోతే ఇది వరకు మాదిరి 90 ప్రశ్నలిచ్చి మొత్తం సమాధా నాలు రాయాలనే నిబంధనలో మార్పు చేశారు. 75 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. అంటే జేఈఈ మెయిన్స్‌ పేపర్‌ 360 మార్కులకు బదులు 300 మార్కులకే ఉంటుందని సమాచారం

విద్యార్థులకు ముఖ్య సూచనలు..
►జేఈఈ మెయిన్స్‌ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యా ర్థులు అడ్మిషన్‌ కార్డుతో పాటు, కోవిడ్‌ లేదన్న స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఏదైనా ఐడీ(ఆధార్‌ లాంటిది) తీసుకొని వెళ్లాలి. 

►పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రెండు పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలు, మాస్క్, హ్యాండ్‌ శానిటై జర్, బాల్‌ పాయింట్‌ పెన్ను వెంట తీసుకెళ్లాలి. 

►పరీక్ష రెండు షిఫ్టు్టలుగా ఉంటుంది. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఉంటుంది. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకూ ఉంటుంది. 

►అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ ‘ఒక నిమిషం’ నిబంధన అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. కాబట్టి వీలైనంత వరకూ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 

►ఈసారి సెక్షన్‌ బీలో కూడా నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top