ప్రభుత్వాసుపత్రుల్లో ఎలా ఉంది?: తెలంగాణ హైకోర్టు | Telangana HC Orders Health Ministry Over Govt Hospitals Facilities | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రుల్లో ఎలా ఉంది?.. రిపోర్ట్‌ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Aug 16 2023 3:31 PM | Updated on Aug 16 2023 3:31 PM

Telangana HC Orders Health Ministry Over Govt Hospitals Facilities - Sakshi

నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రిలో గర్బిణీ మృతిచెందిన వ్యవహారంపై.. 

సాక్షి, హైదరాబాద్‌: నాగర్‌ కర్నూల్‌లో గర్భిణీ మృతి కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఆస్పత్రుల్లో వసతులపై నివేదిక అందజేయాలని వైద్యారోగ్య శాఖకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బెంచ్‌..  ‘‘ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు. వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తోన్న బడ్జెట్‌ ఎంత?’’ అని ప్రశ్నించింది హైకోర్టు.  ఈమేరకు సమగ్ర నివేదిక అందజేయాలంటూ..  తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: వాతావరణ శాఖ హెచ్చరికలతో కేసీఆర్‌ పర్యటన వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement