ఎంపీ సంతోష్‌పై ‘ఇండియా ఫోర్బ్స్‌’ కథనం  | Telangana: Forbes India Article On MP Joginapally Santosh Kumar | Sakshi
Sakshi News home page

ఎంపీ సంతోష్‌పై ‘ఇండియా ఫోర్బ్స్‌’ కథనం 

Dec 21 2022 1:49 AM | Updated on Dec 21 2022 10:35 AM

Telangana: Forbes India Article On MP Joginapally Santosh Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను మొక్కలు నాటడంతోపాటు ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ద్వారా లక్షలాది మందిని హరిత ఉద్యమంలో భాగస్వాములను చేసిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ‘ఇండియా ఫోర్బ్స్‌’తాజా సంచికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో ‘పచ్చదనంతోనే పరిపూర్ణత’నినాదంతో 2018 జూలై 17న సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు.

రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రీడా ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతోపాటు సామాన్యులను కూడా మొక్కలు నాటడంలో భాగస్వాములను చేశారు. మొక్కల ఔషధ గుణాలను తెలుపుతూ వృక్షవేదం అనే పుస్తకాన్ని ప్రచురించడంతోపాటు సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా 2021 ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’పేరిట ఒకే రోజు కోటి మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో సంతోష్‌ కృషిపై ఇండియా ఫోర్బ్స్‌ ప్రత్యేక కథనం ప్రచురించింది.

Advertisement
 
Advertisement
Advertisement