కేసీఆర్‌ బీజేపీకి అనుకూలమా, వ్యతిరేకమా?: చాడ | Telangana: CPI Chada Venkat Reddy Comments On CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ బీజేపీకి అనుకూలమా, వ్యతిరేకమా?: చాడ

Oct 19 2021 3:05 AM | Updated on Oct 19 2021 3:05 AM

Telangana: CPI Chada Venkat Reddy Comments On CM KCR - Sakshi

హుస్నాబాద్‌: ఢిల్లీకి వెళ్లినప్పుడు బీజేపీకి అనుకూలంగా, తెలంగాణకు వస్తే ప్రతికూలంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌ బీజేపీకి అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నా బాద్‌ లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మోదీ అధికారంలోకి వచ్చాక అన్నివర్గాలపై ఆర్థికంగా, చట్టపరంగా దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకుంటే, ఇక రాష్ట్రాలకు చెరువులు, కుంటలు తప్ప ఏమీ ఉండవన్నారు.  తెలంగాణలోని 119 నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూనే, 25 నియోజకవర్గాల్లో పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు చాడ వివరించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement