‘అందుకే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా’ | Telangana CM Revanth Reddy Defends Holding Education Portfolio | Sakshi
Sakshi News home page

‘అందుకే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా’

Sep 11 2026 9:49 PM | Updated on Sep 11 2026 9:50 PM

Telangana CM Revanth Reddy Defends Holding Education Portfolio

హైదరాబాద్‌:  విద్యాశాఖ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ అని, ముఖ్యమంత్రి విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్‌ 11వ తేదీ) అసెంబ్లీ వేదికగా సీఎం విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడంపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చారు. 

‘విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ.  ముఖ్యమంత్రి విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టే. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ పాల్గొంటుంది.  చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ సహా అధికారులు సమీక్షకు హాజరవుతారు. మంత్రిగా విద్యాశాఖ సమీక్ష చేస్తే సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రమే హాజరవుతారు. 

ముఖ్యమంత్రిగా విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థను ఒకే, టేబుల్‌పైకి తీసుకురాగలుగుతాం. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుంది.  విద్యాశాఖకు ఫుల్‌టైమ్ మంత్రి లేరని పరిమిత సమాచారంతో విమర్శలు చేయడం సరికాదు.  వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రభుత్వం పనిచేస్తోంది. 

పేదలకు మేలు జరిగే శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించాలి.  న్యాయశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలను నా వద్దే ఉంచుకున్నా. ప్రజాస్వామ్యంలో పీఎం, సీఎం, డీఎం అత్యంత శక్తివంతమైన పదవులు.  ముఖ్యమంత్రి వద్ద ఉన్న అధికార పరిధి అత్యంత కీలకమైనది. మంత్రులందరూ ముఖ్యమంత్రికి సహాయక వ్యవస్థగా పనిచేస్తారు. అధికారులు, ఇతర వ్యవస్థలు కూడా ప్రభుత్వానికి సహాయక వ్యవస్థలే. పేదలకు మేలు చేసే నిర్ణయాలు వేగంగా తీసుకోవడమే లక్ష్యం

ప్రైవేటు విద్యా వ్యవస్థలో రెండున్నరేళ్లకే పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్లకు పాఠశాలకు పంపిస్తున్నారు. అందుకే  తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. నర్సరీ, ఎల్.కే.జీ విధానంతో పాటు ఇంగ్లీష్ భాష కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలల్లో మొట్ట మొదటిసారిగా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. 

ఈ ఏడాది 64 వేల మంది ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నాం.  నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్స్ డిజైన్ చేసి నాణ్యమైన హైజెనిక్ బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నాం. పదేళ్లు వాళ్లు పట్టించుకోకపోతే మేం  ఆధికారంలోకి రాగానే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాం. ఒక రేవంతన్నగా మేం ఇన్ని చేసినా ఎప్పుడూ చెప్పుకోలేదు’ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:  కొండా సురేఖ బర్తరఫ్‌పై కేటీఆర్ రియాక్షన్ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement