ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్‌

Telangana CM KCR Reached Hyderabad After Completing Delhi Tour - Sakshi

హైదరాబాద్‌: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఐదురోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 

గత శుక్రవారం ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా..  దేశంలో ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్‌ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: CM KCR: ఏకమై ఎండగడదాం!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top