Chityala Police Barricade: జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డు ఏర్పాటు

Telangana: Chityala Police Barricade Message On Women Goes To Viral - Sakshi

పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన బారిగేట్‌పై పోలీసులు వినూత్న హెచ్చరికను రాయించారు. Chityala Police Barricade

సాక్షి, చిట్యాల (నల్గొండ): రోడ్లపై ప్రమాదాలు జరగకుండా, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు అక్కడక్కడ బారిగేట్‌లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ బారిగేట్‌లపై ఆగి వెళ్లుము.. చూసి వెళ్లుము, వేగం కన్నా.. ప్రాణం మిన్న వంటి సూక్తులు రాస్తుంటారు. కానీ, చిట్యాలలోని హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన బారిగేట్‌పై పోలీసులు వినూత్న హెచ్చరికను రాయించారు. ‘స్త్రీలను కాదు.. బండి రోడ్డువైపు చూసి నడుపు’ అని బారిగేట్‌పై రాసి ఉంది. దీనిని చూసిన వాహనదారులు ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు.

చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని చెప్పి మోసం
చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top