తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలివే..

Telangana Cabinet Key Decisions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలతో ముగిసింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర క్యాబినెట్ రెండు గంటల పాటు కొనసాగింది. కొత్త రెవెన్యూ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలన్న బీసీ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. బుధవారం అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ సివిల్‌ కోర్ట్స్ యాక్ట్‌ -1972కు సంబంధించిన సవరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ కెబినెట్‌ తీసుకున్న కీలక  నిర్ణయాలు: 

-ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్,(వీఆర్‌ఓ) 2020కు ఆమోదం
-    ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020కు ఆమోదం
-    తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్‌ -2019లోని సవరణ బిల్లుకు ఆమోదం
-    పంచాయితీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్ట్‌ – 2018 సవరణ బిల్లుకు ఆమోదం
-    తెలంగాణ జీ.ఎస్.టీ యాక్ట్‌ -2017 సవరణ బిల్లుకు ఆమోదం
-    తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్‌ అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020కు ఆమోదం
-   ది తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020కు ఆమోదం
-    ది తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ బిల్ -2002కు ఆమోదం
-    ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ కు ఆమోదం
-    టీఎస్ ఐపాస్ బిల్‌కు ఆమోదం
-    తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్‌ -1956 సవరణ బిల్లుకు ఆమోదం
-    ది తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్‌ -1972 సవరణ బిల్లుకు ఆమోదం
-    కొత్త సెక్రటేరియట్ నిర్మాణం(సచివాలయం), పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదం
-    కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు ఆమోదం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top