కొత్తరకం కరోనా: తెలంగాణ అప్రమత్తం

Telangana Alerted Again Due To New Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రకం కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ అప్రమత్తమైంది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ టెస్టుల నిర్వహణకు ఏ​ర్పాట్లు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించనున్నారు. నెగిటివ్‌ వచ్చినవారికి వారం రోజులు క్వారంటైన్‌కు తరలించేవిధంగా చర్యలు చేపట్టారు. ఇది ఇలా ఉండగా, యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌తో మిగతా రాష్ట్రాలు కూడా అలర్ట్‌ అవుతున్నాయి. (చదవండి: కొత్తరకం ‍కరోనా వైరస్‌: మహారాష్ట్రలో కర్ఫ్యూ!)

ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. స్ట్రెయిన్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. బ్రిటన్‌ మీదుగా భారత్‌కు వచ్చే వారిపై ఆంక్షలు విధించింది.  భారత్‌ వచ్చాక ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top