730 మంది టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లు ఏఆర్‌కు మార్పు 

Telangana: 730 TSSP Constable Transferred To AR - Sakshi

జిల్లాల్లో రిపోర్టు చేసిన కానిస్టేబుళ్లు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుళ్లు చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ (ఏఆర్‌) మార్పు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల కొత్తగా 3,805 మంది బెటాలియన్‌లో చేరడంతో 2005, 2006, 2007 బ్యాచ్‌లకు చెందిన 730 మంది కానిస్టేబుళ్లను టీఎస్‌ఎస్‌పీ శుక్రవారం రిలీవ్‌ చేసింది. వీరంతా శనివారం వారికి కేటాయించిన జిల్లా యూనిట్లలో రిపోర్టు చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలను గతేడాది డిసెంబరులోనే ప్రభుత్వం జారీ చేసినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా అవి అమలు కాలేదు. 2008, 2009 బ్యాచ్‌ల కానిస్టేబుళ్ల ఏఆర్‌ కన్వర్షన్‌కు సంబంధించిన ఫైల్‌ను కూడా ఉన్నతాధికారులు ఆమోదించారని సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top